కడప: జిల్లాలో పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత నమ్మకం పెంపొందించేలా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం:నూతన ఎస్పీ నచికేత్
Kadapa, YSR | Sep 15, 2025 జిల్లాలో పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత నమ్మకం పెంపొందించేలా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా నూతన ఎస్.పి గా షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలతో జిల్లా ఎస్.పి గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మీడియాతో మాట్లాడుతూ జిల్లా లో ఎస్.పి గా విధులు నిర్వర్తించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గ