బనగానపల్లె: నందవరం చౌడేశ్వరి దేవస్థానానికి వేలాల్లో.రూ.3.80 లక్షల ఆదాయం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవస్థానానికి భక్తులు సమర్పించిన తల నీలాల బహిరంగ సీల్డ్ టెండర్ వేలాల్లో రూ.3.80 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. తలనీలాలు పోగు చేసుకొనే హక్కు ప్రొద్దుటూరుకు చెందిన ఎం.పుల్లయ్య రూ.9 లక్షలకు దక్కించుకున్నాడు. గతంలో రూ.5.80 లక్షలు ఉండగా, ఈ ఏడాది రూ.9 లక్షలకు వెళ్లిందని ఈవో తెలిపారు.