ఒంగోలు అర్బన్: గ్రీవెన్స్ అర్జీల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 27, 2026
ప్రకాశం జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను సమర్పించి, స్వేచ్ఛాయుత వాతావరణంలో వారియొక్క సమస్యలను వివరించారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యల వివరాలను తెలుసుకొని, పరిష్కరిస్తామని భరోసా కల్పించారు