కనిగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న కంప్యూటర్ ల్యాబ్ భవనం కోసం తగిన స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ హసీనా, అధికారులు పాల్గొన్నారు.