ఒంగోలు అర్బన్: జగన్ చెల్లని రూపాయి : రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 23, 2026
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక చల్లని రూపాయి అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి వాడుకున్నట్లు ఏ ముఖ్యమంత్రి వాడుకోలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయన్నారు. గడిచిన 20 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో జగన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. త్వరలో మూడు ఎన్నికలు వస్తున్నాయని వాటిల్లో ఎవరు నిజాయితీపరులు తెలుస్తుంది అన్నారు.