పుంగనూరు: ప్రసన్నయ్య గారి పల్లెలో యువతీ అదృశ్యం కేసు నమోదు.
సిఐ సుబ్బారాయుడు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్య గారి పల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సుబ్రహ్మణ్యం కుమార్తె 19 సంవత్సరాలు శుక్రవారం ఇంటి నుంచి ఆధార్ కార్డు తీసుకొని జిరాక్స్ నిమిత్తం వెళ్ళింది. జిరాక్స్ కోసం వెళ్ళిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లలో గాలించిన ఫలితం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై మహిళా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు. సిఐ సుబ్బారాయుడు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు.