అమలాపురం టికెట్ జనసేనకు కేటాయిస్తే సహకరించేది లేదని హెచ్చరించిన దళిత తెదేపా నేతలు#@
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాజకీయం వేడక్కింది..అమలాపురం పట్డణంలోని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఇంటి వద్ద దళిత నేతలు సమావేశమయ్యారు..గౌరవం లేని చోట ఉండేదే లేదని,అమలాపురం టికెట్ జనసేనకు కేటాయిస్తే సహకరించేది లేదని దళిత నేతలు తేల్చి చెప్పారు.. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న దళితులంతా తెదేపా కి రాజీనామ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.. జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటి మాత్రమే జనసేనకి ఇవ్వాలని,రెండు చోట్ల జనసేనకు ఇస్తే సహకరించేది లేదని టీడీపీ ఎస్సీ నేతలు హెచ్చరించారు.