జామాయిల్ సాగు, మొక్కల విక్రయాలపై నవంబర్ 22వ తేదీన రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు సత్యవేడు అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ బ్రహ్మయ్య ఆదివారం పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అటవీ అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన జామాయిల్ మొక్కలను విక్రయించడానికి నిర్ణయించామన్నారు. నవంబర్ 22వ తేదీన సాయంత్రం 3 గంటలకు అవగాహన కల్పిస్తామన్నారు.