సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ మహేశ్వరం ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ. 10 లక్షలను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.