యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో ఘనంగా బతుకమ్మ వేడుకలు: 2,000 మంది మహిళల సందడి
యాదగిరిగుట్టలో అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో సుమారు 2,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీర్ల అనిత పాల్గొని మహిళలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో యాదగిరిగుట్ట పట్టణం పులకించిపోయింది.