చిట్యాల: ఎలికట్టె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ నేడు మృతి,ఎస్సై రవికుమార్ వివరాలు వెల్లడి
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఎలికట్టె వద్ద ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం, ఇస్మాయిల్ పల్లికి చెందిన మాద నరసింహ (50) అనే వ్యక్తి మునుగోడు కు వెళ్లి తిరిగి వస్తుండగా తన బైకును ఓ గూడ్స్ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతుడి కుమారుడు హరికృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.