ఒంగోలు అర్బన్: రైల్వే డీఎస్పీ శ్రీ మురళీధర్ పర్యవేక్షణలో 25 మంది చిన్నారుల రక్షణ. 15 మంది సహాయకుల అరెస్ట్
Ongole Urban, Prakasam | Jun 24, 2026
బాలల అక్రమ రవాణా మరియు బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, SARDS సంస్థ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ , GRP, RPF మరియు AHTU శాఖల సమన్వయంతో నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం 25 మంది చిన్నారులను రక్షించి, వారితో ప్రయాణిస్తున్న 15 మంది ఎస్కార్ట్‌లు/సహాయకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది .SARDS సంస్థ అందించిన విశ్వసనీయ సమాచారంతో, రైలు నెం.16602 జోగ్‌బాని–ఈరోడ్ ఎక్స్‌ప్రెస్ లో బీహార్ రాష్ట్రం నుండి ఈ రోడ్డుకు వస్తున్న వారిలో కొందరిని రక్షించారు