డోన్: బేతంచర్ల జడ్పీ హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్
Dhone, Nandyal | Apr 20, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని మెయిన్ జెడ్పీ హైస్కూల్లో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. హెచ్ఎం హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ఎంఈఓ అబ్రహం హాజరయ్యారు. విద్యార్థులు తమ ఇళ్ల నుంచి రకరకాల వంటకాలను తెచ్చి ప్రదర్శించారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం సాధ్యమని, ప్రతి ఒక్కరూ పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని ఎంఈఓ సూచించారు. ఆహార పదార్థాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు