కోడుమూరు: టీడీపీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద భీమా చెక్కులు అందించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గంలో 5 మంది టీడీపీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం అందించారు. వరలక్ష్మి, రామ గోవిందు నాగరాజు, జయన్న, సుధాకర్ అనే వ్యక్తులకు టీడీపీలో క్రియాశీలక సభ్యత్వం ఉంది. ప్రమాదంలో మృతి చెందిన వీరికి పార్టీ రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేసింది. చెక్కులను అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.