మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలో కి వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వమేనని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్టలో మనోహర్ యాదవ్, అతని అనుచరులు సుమారు 100 మంది ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కండువాలు కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డప్పు చప్పుళ్ళు, బాణసంచాతో ఘన స్వాగతం పలికారు. స్థానికంగా బి ఆర్ ఎస్ పార్టీ