నంద్యాల అర్బన్: దీబగుంట్ల మెట్ట వద్ద ఆటో బోల్తా, నలుగురు కూలీలకు గాయాలు
Nandyal Urban, Nandyal | Apr 5, 2026
నంద్యాల జిల్లా దీబగుంట్ల మండలంలోని దీబగుంట్ల మెట్ట వద్ద ఆటో బోల్తాపడి నలుగురు గాయపడ్డారు. యాళ్ళూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు నంద్యాలలో పనికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా దీబగుంట్ల మెట్ట వద్ద రోడ్డు డివైడరు ఆటో ఢీకొనడంతో బోల్తా పడింది. ఆటోలో 8మంది ప్రయాణికులు ఉండగా, నలుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ సుధా కర్ రెడ్డి వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.