అసిఫాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది బీజేపీనే: కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ శ్యాంనాయక్
BC రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్ ఆరోపించారు. శనివారం ఆసిఫాబాద్ స్థానిక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి. పార్లమెంటు ఆమోదం కోసం పంపించాం. కానీ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ నాయకులు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని తెలిపారు. అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ పార్లమెంటులో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బీజేపీ నాయకులు ఇష్టం లేదన్నారు.