డోన్: బేతంచర్ల లో అయ్యప్ప స్వామి ఊరేగింపు
Dhone, Nandyal | Jul 6, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన నంద్యాల రహదారిలో గల అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారంఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామిని ఊరేగించారు. అయ్యప్ప సేవా సమితి భక్త బృందం ఆధ్వర్యంలో వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, మాలికా పురోత్తమ, అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువు ఉంచి ఊరేగించారు.