కామారెడ్డి: మద్యం సేవించి వాహనాలు నడిపిన 8 మందికి జైలు శిక్ష, జరిమానా : జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి : మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి రెండు రోజుల జైలు శిక్షిత పాటు వేయి రూపాయల జరిమానా విధించినట్లు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ తెలిపారు. కామారెడ్డి, దేవునిపల్లి, దోమకొండ ప్రాంతాలలో మద్యం సేవించి పట్టుబడిన 8 మందికి మొత్తం రూ. 8 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని సోమవారం రాత్రి 8 గంటల తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పలు సూచనలు జారీ చేశారు. మీ కుటుంబం ఇతరుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దు, మీ నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారన్నారు.