రాప్తాడు: పెద్దన్న గారి పల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పెద్దన్న గారి పల్లి గ్రామంలో శనివారం రెండు గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి జిల్లాకు స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పెద్దన్న గారి పల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినందుకు స్వాగతం పలకడం జరిగిందని అదేవిధంగా ఈ ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రతి చెరువుకు ప్రతి ఎకరాకు నీరు ఇస్తానని హామీ ఇవ్వడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని పరిటాల సునీత తెలిపారు.