పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రైతులు నుంచి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా బస్తాల స్టాక్ వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. టోకెట్ల జారీ విషయంలో వివాదం తలెత్తడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.పర్వతగిరి గ్రామానికి చెందిన వారికి మాత్రమే యూరియా ఇస్తామనడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి తరలివచ్చిన ప్రజలకు అదికారుల మధ్య గొడవ తలెత్తింది. వరి, పత్తి వేసి నెలరోజులు గడుస్తున్న సరిపడా యూరియా బస్తాలు లభించకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.