ఒంగోలు అర్బన్: తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా
Ongole Urban, Prakasam | Jul 10, 2026
తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు ఇచ్చిన హామీల మేరకు జీతం పెంచాలని పనివారం తగ్గించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వేతన స్కేలును అమలు చేయాలని కోరారు యాప్ల పని భారం తగ్గించి ఇచ్చిన హామీలను ప్రభుత్వ నెరవేర్చాలని కోరారు