గుత్తి ఆర్ఎస్ లోని పునీత బోజప్ప చర్చి పై కొందరు ఉద్దేశపూర్వకంగా నిరాధారణమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని విచారణ కమిటీ సభ్యులు డేవిడ్ అన్నారు. గుత్తి ఆర్ఎస్ఎస్ లోని పునీత బోజప్ప చర్చిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూల్ నుంచి మత గురువులైన ఐదు మంది విచారణ కమిటీ సభ్యులుగా వచ్చామన్నారు. కొందరు కొన్ని రోజులుగా ఉద్దేశపూర్వకంగా చర్చిపై, పాస్టర్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారి ఆరోపణలలో పస లేదన్నారు. 90 సంవత్సరాలుగా చర్చి ప్రశాంతంగా కొనసాగుతున్నదన్నారు. ఇకనైనా విమర్శలు మాని అందరూ కలిసికట్టుగా చర్చి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.