అవుకులో 29 నుంచి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా అవుకులో వెలసిన పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. 29న అంకురార్పణ, 30న స్వామివారి కళ్యాణం, మే 6న రథోత్సవం ప్రధాన ఘట్టాలుగా సాగనున్నాయి. మే 7న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.