గుంటూరు: స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Guntur, Guntur | Sep 17, 2025 జిల్లాలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంబించడం సంతోషదాయకం అన్నారు. దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టుటకు, యు.పి.ఐ, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. 30 కోట్ల సెల్ ఫోన్లు దేశంలో తయారు చేసి ఎగుమతులు చేసే పరిస్థితి ఉందన్నారు.