బనగానపల్లె: సంజాములలో రికార్డు స్థాయిలో 44.8 సెంటీగ్రేడ్లో ఉష్ణోగ్రత నమోదు
నంద్యాల జిల్లా సంజామలలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా జాగ్రత్తలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.