కనిగిరి: వెంకుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి పట్టణం మంగలి మాన్యం చెందిన మహిళ అక్కడికక్కడే మృతి
కనిగిరి పట్టణంలోని మంగలి మాన్యం కు చెందిన మహిళ పొన్నలూరు మండలం వెంకుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి పట్టణంలోని మంగలి మన్యం కు చెందిన కాసింబి అనే మహిళ తన కుమారుడు నాయబ్ రసూల్ తో కలిసి మోటార్ బైక్ పై ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుంది. ఈ క్రమంలో పొన్నలూరు మండలం వెంకుపాలెం వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో కాసింబి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె కుమారుడు నాయబ్ రసూల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ నాయబ్ రసూల్ ను స్థానికులు వైద్యశాలకు తరలించారు.