నరసరావుపేట సమీపంలోని నీతికుంటలో గుర్తుతెలియని యువకుని మృతదేహం
నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం గ్రామ పరిధిలోని నీటి కుంటలో గుర్తు తెలియని యువకుని మృతదేహన్ని స్థానికులు గుర్తించి శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సిహెచ్ కిషోర్ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నీటి కుంట నుంచి వెలికి తీశారు. యువకుని ఒంటిపై ఐలవ్యూ అనే పచ్చబొట్టు ఉందని, రాళ్లతో బలంగా వెనక వైపు నుంచి కొట్టినట్లు గాయాలున్నట్లు గుర్తించి, విచారిస్తున్నారు.