బనగానపల్లె: బనగానపల్లెలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయానికి భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని రూ. 1.95 కోట్ల తో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నవాబుల కాలంలో నిర్మించిన పాత గ్రామపంచాయతీ భవనం పురావస్తు కట్టడంగా మారడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.