అనుముల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది: MLA కుందూరు జైవీర్రెడ్డి
నల్గొండ జిల్లా, అనుముల మండలం, హాలియా పట్టణ కేంద్రంలో మంజూరైన నూతన రేషన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వమని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు.