సిరిసిల్ల: విద్యుత్ వైర్ల చోరీ కేసు నమోదు
విద్యుత్ వైర్ల చోరీ కేసు నమోదు.ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివారు వద్ద విద్యుత్ వైర్ల చోరీ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంగ్లా ధర్మ గౌడ్ తన వ్యవసాయ క్షేత్రంలో నీటి పారుదల సౌకర్యం కోసం సుమారు రూ.30 వేల విలువైన విద్యుత్ వైర్లు అమర్చుకున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఆ వైర్లను దొంగిలించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుని ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు.