సిర్పూర్ టి: ఇట్యాల గ్రామంలో వివిధ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం పోలీసులు
దాహెగం మండలం ఇట్యాల గ్రామంలో వివిధ చట్టాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఏటీఎం పిన్నులు, అపరిచిత ఫోన్ కాల్స్, తెలియని లింకులను ఓపెన్ చేసి మోసపోకూడదని ప్రజలకు పోలీసులు సూచించారు. గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత చదువులు చదవాలని యువకులకు సూచించారు,