రాజేంద్రనగర్: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాష్ట్రీయ ఏకతా దివస్ 2కే రన్
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ 2K రన్ నిర్వహించారు. ఎల్బీనగర్ ACP కృష్ణయ్య, CI సైది రెడ్డి ఆధ్వర్యంలో సరూర్నగర్ నుంచి VM. గ్రౌండ్ వరకు రన్ కొనసాగింది. “భారత్ మాతకి జై”, “జై జవాన్ జై కిసాన్” నినాదాలతో పోలీసులు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.