ఆత్మకూరు: ఆత్మకూరు చెరువులో నీట మునిగిన వ్యక్తి మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసిన పోలీసులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు చెరువులో ఆదివారం ఈతకు వెళ్లి మహేష్ గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి కూడా అధికారులు ముమ్మరంగా మహేష్ కోసం గాలించారు. సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ రావు తెలిపారు.