నంద్యాల అర్బన్: స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న నంద్యాల మున్సిపల్ కార్యాలయం
Nandyal Urban, Nandyal | Jun 8, 2026
వీడియోలో నీళ్లు చూస్తుంటే ఎక్కడో స్విమ్మింగ్ పూల్ లేదా చెరువులా అనిపిస్తుంది అనుకుంటే పొరపడినట్లే. నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఇది. నంద్యాలలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం వద్ద వర్షపు నీరు చెరువు, స్విమ్మిగ్ పూల్ను తలపిస్తుంది. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యానికి ఈ దృశ్యం అద్దం పడుతుందని స్థానికులు అంటున్నారు.