ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే విజయ్ కుమార్
Ongole Urban, Prakasam | May 28, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. అధికారకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నేతలు కలెక్టర్ నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేతలు కొనియాడారు