కోటపల్లి: మంచిర్యాల: గొర్ల కాపరులపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి, అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గాం గ్రామంలో గొర్ల కాపరులపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి చేశారు. గొడ్డలితో కొట్టడంతో తమకు గాయాలయ్యాయని బాధితులు సంతోష్, ఓదన్న ఆరోపించారు. నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.