అనంతపురం అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో యువకుడు నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 4, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో అనిల్ కుమార్ అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం మధ్యాహ్నం వివరాలను వెల్లడించారు. నీలకంఠాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిగా అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.