కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ (3.0) కార్య క్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా శుక్రవారం హాజరయ్యారు. విద్యార్థులు తయారుచేసిన 3d ప్రింటింగ్, సర్వింగ్ రోబో, గ్రీన్ ఎనర్జీని పరిశీలించి వారిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయాన్ని పొందగలరని ఆయన సూచించారు.