ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా డాన్సులు ఇరగదీసిన అభిమానులు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీజే పాటలకు అభిమానులు డాన్సులు వేస్తూ భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగరేస్తూ కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.