అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో ఉన్న సూరంపాలెం ప్రాజెక్టు ప్రధాన గట్టు నిండా తుప్పలు పొదలు భారీగా పెరిగిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు స్థానిక రైతులు తెలిపారు. సూరంపాలెం ప్రాజెక్టు ద్వారా గంగవరం గోకవరం కోరుకొండ మండలాలలో సుమారు 14 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రధాన గట్టు నిండా తుప్పలు పొదలు చెత్తాచెదారాలు పెరిగిపోయి ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు అధికారులు వీటిని తొలగించాలని కోరారు. వీటివల్ల సమస్యలు ఉంటాయని, తుప్పలు, పొదలు తొలగించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.