బనగానపల్లె: బనగానపల్లె మండలం లో షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరి కొత్తపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. నాగ సురేంద్రకు చెందిన బార్బర్ షాప్లో మంటలు వ్యాపించి దుకాణం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే నష్టం జరిగిందని, ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు.