నంద్యాల అర్బన్: జన గణన ప్రతి పౌరుడి బాధ్యత, నంద్యాలలో 5కే రన్ ప్రారంభించిన కలెక్టర్
Nandyal Urban, Nandyal | Apr 26, 2026
జన గణన ప్రతీ పౌరుడి బాధ్యత అని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జన గణనపై అవగాహన కల్పించేందుకు నంద్యాలలో ఈరోజు నిర్వహించిన 5కే రన్ను ఆమె ప్రారంభించారు. టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు సాగిన ఈ పరుగులో విద్యార్థులు, మహిళలు, యువత పాల్గొని సందడి చేశారు. జన గణనకు అందరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు, ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.