పుంగనూరు: మధురమలై కొండ వద్ద తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టర్ కు గండి. ఎస్టి కాలనీకు రాకపోకలు బంద్
. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నపట్నంచెరువు పూర్తిస్థాయిలో నిండి శుక్రవారం రాత్రి నుంచి మొరవ పారుతున్నది. మధురమలై కొండ ప్రాంతంలో తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టర్ కు గండి పడింది. కల్వర్టర్ కు గండిపడడంతో ఎస్టి కాలనీకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఘటన సోమవారం మధ్యాహ్నం ఒక గంటకు వెలుగులో వచ్చింది.