కడప: కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని పెంపొందించడమే విశ్వకర్మ జయంతి ఉద్దేశ్యం: డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు
Kadapa, YSR | Sep 17, 2025 కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యం అని.. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు తోపాటు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డా. శ్రీనివాసా చారి, ఎస్డీసి వెంకటపతి, ఎస్సి కార్పోరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు