బనగానపల్లె: బనగానపల్లెలో దారుణం, భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెంకట లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళను కుటుంబ కలహాలతో భర్త వెంకన్న గొడ్డలితో నరికి చంపాడు. భార్య వెంకట లక్ష్మమ్మ శనివారం రాత్రి చంపి ఇంటికి తాళం తీసి భర్త వెంకన్న వెళ్లిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు