జహీరాబాద్: జహీరాబాద్ లో ప్రైవేట్ బస్సులో మంటలు, విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రావుస్ పాఠశాల చెందిన బస్సు సోమవారం సాయంత్రం పాఠశాల వదిలిన అనంతరం విద్యార్థులతో వెళుతుండగా బీదర్ చెక్ పోస్ట్ సమీపంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.వెంటనే గుర్తించిన బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి స్థానికుల సాయంతో విద్యార్థులను కిందికి దింపేశారు. బస్సులో చెలరేగిన మంటలను నీళ్లు పోసి ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.