కోడుమూరు: ఈ తాండ్రపాడులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే దస్తగిరి సభ
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై సోమవారం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రజలకు అవగాహన కల్పించారు. వస్తు సేవా పన్ను తగ్గించడం వలన అన్ని వర్గాల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈనెల 16న దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.