బనగానపల్లె: బనగానపల్లెలో బస్సును ఢీకొట్టిన కారు, తప్పిన పెను ప్రమాదం
బనగానపల్లెలో కలకలం. కొండపేటలోని బీ ఆశురఖానా సమీపంలో వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో భారీగా జనం గుమిగూడడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు మరియు స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించారు.