నంద్యాలలోని గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో శనివారం ఉదయం భవాని మాలధారులు ఇరుముడులు కట్టుకుని విజయవాడకు బయలుదేరారు. వేద పండితులు ఉదయ్ కుమార్ శర్మ, మురళి శర్మ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భవాని మాత నామస్మరణలు చేస్తూ భక్తులు ఇరుముడులు కట్టుకుని విజయవాడకు ప్రయాణమయ్యారు.